2013          I           2014          I           2015
2014

1. ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ, హైదరాబాద్ తేది 25 జనవరి, 2014 న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రజాకవి పద్మవిభూషణ్ డా.కాళోజీ నారాయణ రావు గారి తెలుగు కవితా సంకలనం ‘నా గొడవ’ హిందీ అనువాదం ‘మేరీ ఆవాజ్’ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అకాడమి సంచాలకులు డా.కె.దివాకరా చారి గారు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ అకాడమీ లక్ష్యానుగుణంగా ప్రముఖ ప్రజాకవి డా.కాళోజీ నారాయణ రావు గారి ‘నా గొడవ’ కవితా సంకలనం నుండి 100 కవితలను హిందీలోకి అనువదించి ప్రచురించడం జరిగింది. ప్రముఖ సినీ దర్శకులు మరియు కాళోజీ ఉత్సవ కమిటి నిర్వాహకులు శ్రీ బి.నర్సింగ రావు గారు ముఖ్య అథితిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కాళోజీ సాహిత్య గొప్పదనం గురించి కొనియాడారు.  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విప్లవాత్మక కవి శ్రీ వరవర రావు గారు విశిష్ట అథితిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఉద్యమాలు, కవుల ప్రభావం కాళోజీ గారి పైన స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ రకాలుగా దోపిడీకి, అణచివేతకు గురవతున్న సామాన్య ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి రచనలు చేసిన మహా కవి కాళోజీ. ఆయన సాహిత్యం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇంత మంచి రచనను ప్రచురించిన హిందీ అకాడమిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీ జీవన్ కుమార్, శ్రీ నిఖిలేశ్వర్, శ్రీ వి.ఆర్.విద్యార్థి గంచి వివరించారు.

2. తేది 26 ఫిబ్రవరి, 2014 బుధవారం సాయంత్రం 5.00 గం.లకు ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమి, హైదరాబాద్ ప్రచురించిన త్రైమాసిక పత్రిక ‘సాహిత్య-సేతు’ మొదటి సంచిక ఆవిష్కరణ డా.రాధేశ్యామ్ శుక్లగారి చేతుల మీదుగా జరిగింది. ఆయన మాట్లాడుతూ చాలా కాలం తర్వాత హిందీ అకాడమి కల నెరవేరబోతోంది. అకాడమి సంచాలకులు డా.కె.దివాకరా చారి గారు మాట్లాడుతూ అకాడమి ద్వారా ‘ సాహిత్య-సేతు’ పత్రికను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం ద్వారా ప్రచురితమయ్యే హిందీ పత్రిక ఇదే కావడం విశేషం. సంపాదకులు డా.బి.సత్యనారాయణ మాట్లాడుతూ భారత దేశంలో ఉన్న భిన్న సంస్కృతులను అనుసంధానం చేసి ఉత్తర-దక్షిణాలను ఒకే తాటిపై నడిపే వారధిగా ఈ పత్రిక పని చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రొ.ఋషభ్ దేవ్ శర్మ, డా.ఎం.వెంకటేశ్వర్, డా.టి.మోహన్ సింగ్, డా.పి.మాణిక్యాంబ మొదలగువారు పాల్గొన్నారు.ారు.

3. ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది 150 వ జయంతి సందర్భంగా 21 జూన్ 2014 న డా.రాధేశ్యామ్ శుక్ల గారి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కవులు పాల్గొన్నారు.

 

4. తేది 14 ఆగష్టు , 20 14 న ‘హిందీ కవి సమ్మేళము’ ను నిర్వహించడం జరిగింది. ఇందులో నగరంలోని ఆరుగురు ప్రముఖ కవులు పాల్గొన్నారు.

 

5. తేది 27 సెప్టెంబర్, 2014 న 'హిందీ దినోత్సవం' ( 14, సెప్టెంబర్, 2014) సందర్భంగా 'భారతీయ సంస్కృతి : హిందీ' విషయం మీద డా.పి.ఆర్.ఘనాతే గారి వ్యాఖ్యానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది..

 

 

 

 

 

 

Copyright 2004 Andrapradesh Hindi Academy