2013          I           2014          I           2015
2013

9. ‘తెలంగాణ ప్రాంతంలో హిందీ సాహిత్యం మరియు సంస్కృతి ’ అను విషయం మీద రాష్ట్ర స్థాయి ఒక రోజు సదస్సు (సెమినార్) 27 సెప్టెంబర్, 2013 న పింగళీ మహిళా కళాశాల, వరంగల్ లో జరిగింది. కార్యక్రమ ప్రారంభ సభలో ముఖ్య అతిథి మరియు హిందీ అకాడమీ, హైదరాబాద్ సంచాలకులు డా.కె.దివాకరా చారి గారు మాట్లాడుతూ –ఆంధ్ర ప్రదేశ్ లో హిందీ ప్రచారం మరియు ప్రసారానికి  పెద్దపీట వేస్తూ ఇక్కడి హిందీ రచనాకారులు, సంస్థలను ప్రోత్సహిస్తూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని రాష్ర స్థాయికి చేర్చడం eఆంద్ర ప్రదేశ్ హిందీ అకాడమీ ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి. ఇందులో భాగంగానే హిందీ అకాడమీ ఇప్పటివరకు రాష్ట్రంలోని అనేక సంస్థలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు ఆర్ధిక సహాయం చేసి వారిని ప్రోత్సహిస్తూ వస్తుంది. ఈ ఉద్దేశ్యంలో భాగంగానే అకాడమీ వరంగల్ లో ఉన్న పింగళీ మహిళా కళాశాలకు ఒక రోజు రాష్ట్రీయ సదస్సు (సెమినార్) కొరకు ఆర్ధిక సహాయం అందించింది. ఆయన ఇంకా మాట్లాడుతూ పీడిత ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి నిర్భయంగా రచనలు చేసిన మహాకవి పద్మవిభూషణ్ డా.కాళోజి నారాయణ రావు గారి ‘నా గొడవ’ కవితా సంకలనం నుండి ఎంపిక చేయబడిన 100 కవితలను హిందీలోకి అనువాదం చేయించి ముద్రిస్తున్నాము. అక్టోబర్ లో ఈ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాము. ప్రజలను చైతన్యం చేస్తూ వారి ఉన్నత జీవనానికి మార్గదర్శనం చేసేలా ఉండేదే నిజమైన సాహిత్యం. ఈ విధంగా సాహిత్యము, భాష ప్రచారం మరియు ప్రసారాన్ని హిందీ అకాడమీ లక్ష్యానుగుణంగా చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర స్థాయి సదస్సు (సెమినార్) కొరకు వరంగల్ లో ఉన్న పింగళీ మహిళా కళాశాలకు ఆర్ధిక సహాయం చేయడం నాకు ఆనందంగా ఉందని అన్నారు.
          డా.టి.మోహన్ సింగ్ గారు తమ కీలక ఉపన్యాసంలో – నిజాం కాలంలో ఉర్దూ జన  భాషగా ఉండేది. ఆ కాలంలో హిందీలో మాట్లాడడం నేరంగా పరిగణించే వారు. ప్రజలు దొంగతనంగా హిందీ మాట్లాడేవారు. కాలం మారుతూ వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో గొప్ప గొప్ప సాహిత్యకారులు పుట్టారు. వీరి వలనే ఈ ప్రాంతంలో హిందీ చాలా వికాసం చెందింది. హిందీని పాలనా భాషగా చేస్తే మరింత వికాసం చెందే అవకాశం ఉంటుందని అయన అభిప్రాయపడ్డారు.
          సభాధ్యక్షురాలు మరియు పింగళీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ప్రమీలగారు మాట్లాడుతూ – ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ ఆంధ్ర ప్రదేశ్ లో హిందీ ప్రచార మరియు ప్రసారానికి చేస్తున్న కృషి ప్రశంశనీయమైనది. తెలంగాణ ప్రాంతంలో హిందీ వికాసం గురించి చెప్తూ, దాని అమలులో ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు.

10. హిందీ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమి, హైదరాబాద్ తేది 20 నవంబర్ 2013 న ‘పుస్తకావిష్కరణ మరియు పురస్కార వితరణ మహోత్సవం’ ను ఏర్పాటు చేసింది. ఇందులో పుస్తక లోకార్పణ కర్త, పురస్కార వితరణ కర్త, కార్యక్రమ అధ్యక్షులుగా అకాడమి సంచాలకులు డా.కె.దివాకరా చారి గారు పాల్గొన్నారు. డా.చారి గారు తన ప్రసంగంలో ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమి తన లక్ష్యానుగుణంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆచార్యులు డా.ఐ.ఎన్.చంద్రశేఖర్ రెడ్డి గారు రచించిన ‘ఆంధ్ర మె హిందీ లేఖన్ ఔర్ శిక్షణ్ కీ స్థితి ఔర్ గతి’ పుస్తకాన్ని హిందీ అకాడమీ ద్వారా ప్రచురించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమి నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ, పాటల పోటీలలో విజయం సాధించిన విద్యార్ధులకు నగదు పురస్కారాలు మరియు ప్రశంసా పత్రాలను డా.చారి గారు అందజేశారు. పుస్తక రచయిత మరియు పుస్తక పరిచయకర్త డా.ఐ.ఎన్.చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో హిందీ శిక్షణ మరియు రచనా కళకు సంబంధించి మూడు ప్రశ్నావళులు తయారు చేసి ఆంధ్ర లో ఉన్న మూడు ప్రాంతాలకు పంపించి, వచ్చిన సమాధానాల ఆధారంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగిందని అన్నారు. పుస్తక సమీక్షకులు ప్రొఫెసర్ ఋషభ్ దేవ్ శర్మ గారు మాట్లాడుతూ ఇది ఈ తరహాలో మొదటి పుస్తకం. హిందీలో ఇలాంటి పుస్తకాలు ఆంధ్ర లో ఇంకా రాలేదని కొనియాడారు.

 

 

 

 

 

Copyright 2004 Andrapradesh Hindi Academy